Home » Punjab
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్స్ గురించిన సమాచారం అందడంతో డేరా బస్సి-అంబాలా హైవే వెంబడి ఉన్న ఒక ఇంటిని తాము చుట్టుముట్టామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు కాల్పులు జరిపారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) తెలిపారు.
ఐఎస్ఐతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు పంజాబ్ పోలీసులకు చిక్కారు. ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.
హర్మీత్ సింగ్ సంధుకు తరన్ తారన్లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ ఆయన 68,235 ఓట్లు దక్కించుకుని గెలుపును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ 22,473 ఓట్లు, సాద్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ 7,158 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు 3,042 ఓట్లు సాధించారు.
పంజాబ్‌లో మరో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గ్రెనేడ్ దాడికి ప్లాన్ చేసిన పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఓ వ్యక్తి తన బట్టల షాపు ప్రమోషన్ కోసం ఎవ్వరూ ఊహించని ఆఫర్ పెట్టాడు. కేవలం 13 రూపాయలకే అన్ని రకాల షర్ట్స్ అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో వందలాది మంది షాపు దగ్గరకు చేరుకున్నారు. అంతమందిని చూసి షాపు యజమాని బిక్కచచ్చిపోయాడు.
తార్న్ తారన్లో అత్యధికంగా 154 కేసులు నమోదు అయ్యాయి. అమృత్‌సర్‌లో 126 కేసులు.. ఫిరోజ్పూర్లో 55, పాటియాలాలో 31, గురుదాస్‌పూర్‌లో 23 కేసులు నమోదు అయ్యాయి.
అమృత్సర్-సహర్సా ఎక్స్‌ప్రెస్ రైల్లోని ఓ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగా బోగీ మొత్తం దగ్ధమైపోయింది. శనివారం శిర్హింద్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. పొగలు మొదలైన వెంటనే గుర్తించిన అధికారులు ప్రభావిత కోచ్‌లోని ప్రయాణికులను ఇతర కోచ్‌లకు తరలించారు. మంటల్లో చిక్కుకుని మూడు బోగీలు దెబ్బతిన్నాయి.
అవినీతి కేసుకు సంబంధించి పంజాబ్‌లోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో సీబీఐ రెయిడ్ నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. రూ.5 కోట్ల నగదు, ఖరీదైన కార్లు, నగలు అధికారులకు చిక్కాయి
ధోతీ కట్టుకుని, పగ్డీ ధరించిన ఓ రైతు తన భార్యతో పాటు మెర్సండెస్ బెంజ్ షో రూముకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరికీ షో రూము వాళ్లు ఘన స్వాగతం పలికారు.