లా కాలేజీలో దారుణం.. క్లాస్ రూములో యువతిపై కాల్పులు..
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:06 PM
పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. యువతిని కాల్చి చంపి.. ఆపై తనూ అదే తుపాకితో కాల్చుకున్నాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. యువతిని కాల్చి చంపి, తను కూడా అదే తుపాకితో కాల్చుకున్నాడు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తార్న్ తరణ్ జిల్లాకు చెందిన ప్రిన్స్ రాజ్, సందీప్ కౌర్‌లు ఉస్మా గ్రామంలోని లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ లా చదువుతున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, రాజ్.. కౌర్‌పై పగ పెంచుకున్నాడు. సోమవారం ఉదయం కాలేజీకి రాగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తన వెంట తెచ్చుకున్న తుపాకితో క్లాస్ రూములో కౌర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో కౌర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కౌర్ చనిపోయిందని ధ్రువీకరించుకున్న తర్వాత రాజ్ అదే తుపాకితో తనను తాను కాల్చుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన రాజ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజ్.. కౌర్‌ను ఎందుకు చంపాడన్న విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి
టీ20 ప్రపంచ కప్ 2026కు దూరం.. వార్మప్ మ్యాచులో గాయపడ్డ హర్షిత్ రాణాకు సర్జరీ
అమెరికాకు భయపడేది లేదు.. యురేనియం శుద్ధిపై వెనక్కి తగ్గబోమంటున్న ఇరాన్..