అమెరికాకు భయపడేది లేదు.. యురేనియం శుద్ధిపై వెనక్కి తగ్గబోమంటున్న ఇరాన్..
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:53 PM
యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య అణు కార్యక్రమంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యురేనియం శుద్ధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాన్ అరాఘ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Iran US tensions).
'యురేనియం శుద్ధిపై మేమెందుకు వెనక్కి తగ్గాలి. అమెరికాపై మాకు పెద్దగా నమ్మకం లేదు. మమ్మల్ని శాసించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ మాపై యుద్ధం ప్రకటించినా మేం యురేనియం శుద్ధిపై వెనక్కి తగ్గేది లేదు. ఈ ప్రాంతంలో వారి (అమెరికా) సైనిక మోహరింపు మమ్మల్ని భయపెట్టలేదు' అని అబ్బాన్ వ్యాఖ్యానించారు. అలాగే అమెరికాతో చర్చల గురించి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన రష్యా, చైనాతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు అబ్బాన్ తెలిపారు (US military deployment region).
అణు ప్రణాళికలకు సంబంధించి ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది (Iran statement US). గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక మోహరింపును పెంచుతోంది. ఒకవేళ ఇరాన్‌తో చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడులకు దిగుతామని అమెరికా పరోక్షంగా సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..