Share News

టీ20 ప్రపంచ కప్ 2026కు దూరం.. వార్మప్ మ్యాచులో గాయపడ్డ హర్షిత్ రాణాకు సర్జరీ

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:58 PM

టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా అనూహ్యంగా దూరమైన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో హర్షిత్ మోకాలికి గాయమైంది. తాజాగా హర్షిత్‌కు సర్జరీ చేశారు.

టీ20 ప్రపంచ కప్ 2026కు దూరం.. వార్మప్ మ్యాచులో గాయపడ్డ హర్షిత్ రాణాకు సర్జరీ
Harshit Rana

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా అనూహ్యంగా దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌నకు ముందు సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో హర్షిత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. తాజాగా హర్షిత్‌(Harshit Rana)కు సర్జరీ చేశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి రాణా ఇన్‌స్టా వేదికగా అప్‌డేట్ ఇచ్చాడు.


ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు కోలుకోవడం, నేను ఇష్టపడేదాన్ని తిరిగి పొందడంపై దృష్టిపెట్టాను’ అని పోస్ట్ పెట్టాడు. కాగా హర్షిత్ రాణా స్థానంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో బుమ్రా అనారోగ్యం కారణంగా ఆడకపోవడంతో సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న మియా.. 3 వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కాగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫిబ్రవరి 12న ఢిల్లీ వేదికగా నమీబియాతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 04:28 PM