Share News

టీ20 వరల్డ్ కప్.. అమెరికా టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్..

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:51 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా క్రికెట్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు.

టీ20 వరల్డ్ కప్.. అమెరికా టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్..
Donald Trump USA cricket

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా క్రికెట్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ది ట్రూత్‌’లో ఆదివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోందని నాకు ఇప్పుడే తెలిసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టీమ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అమెరికా మీకు పూర్తి మద్దతుగా ఉంది’ అని రాసుకొచ్చారు.


కాగా, టీ20 వరల్డ్ కప్‌ 2026లో భాగంగా 20 దేశాల మధ్య పోటీ నడుస్తోంది. శనివారం భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫిబ్రవరి 7వ తేదీన మొదలైన మ్యాచ్‌లు మార్చి 8వ తేదీ వరకు సాగనున్నాయి. అమెరికా గ్రూప్-ఏలో ఉంది. ఇండియా, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్ దేశాలతో తలపడనుంది.


ఈ సారి భారత మూలాలున్న 30 మందికిపైగా ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ఈ టీ20 ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఆటగాళ్లలో కొందరు భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడిన వాళ్లు కూడా ఉండడం గమనార్హం. ఇంతమంది భారత సంతతి ఆటగాళ్లు మెగా టోర్నీలో పోటీపడుతుండడం ఇదే తొలిసారి. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో రెండు విదేశీ జట్లను భారతీయ మూలాలున్న ఆటగాళ్లే నడిపిస్తున్నారు. ఒమన్‌ జట్టుకు 36 ఏళ్ల జతిందర్‌ సింగ్‌, కెనడా జట్టుకు దిల్‌ప్రీత్‌ బజ్వా కెప్టెన్లుగా ఎంపికయ్యారు.


ఇవి కూడా చదవండి..

ప్రకృతి సృష్టించిన అద్భుతం.. అంటార్కిటికా హిమానీనదం నుంచి రక్తం.. షాకింగ్ వీడియో వైరల్..

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ కొండపై మేక ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి!

Updated Date - Feb 09 , 2026 | 11:46 AM