Share News

వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్.. నువ్వసలు మనిషివేనా.!

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:32 PM

పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్‌కు తెరతీశాడు. ఓ చిన్న కుక్కపిల్లను 100 రోజుల పాటు పెంచి 101వ రోజు తినడానికి సిద్ధమయ్యాడు. అయితే ఊహించని విధంగా ఆ ఛాలెంజ్ బెడిసికొట్టింది. జంతు ప్రేమికులు అతడికి సరైన విధంగా బుద్ధి చెప్పి.. ఆ శునకాన్ని రక్షించారు.

వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్.. నువ్వసలు మనిషివేనా.!
100 day dog biryani challenge

ఇంటర్‌నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. పిచ్చి పిచ్చి పనులకు తెర తీస్తున్నారు. తాజాగా ఓ యువకుడు వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్‌కు తెరతీశాడు. ఓ చిన్న కుక్క పిల్లను 100 రోజుల పాటు పెంచి 101వ రోజు తినడానికి సిద్ధమయ్యాడు. అయితే ఊహించని విధంగా ఆ ఛాలెంజ్ బెడిసికొట్టింది. జంతు ప్రేమికులు అతడిని వెతుక్కుంటూ వెళ్లి సరైన విధంగా బుద్ధి చెప్పి.. అతడి చెరలో ఉన్న శునకాన్ని రక్షించారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 100 రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్ మొదలుపెట్టాడు. ఛాలెంజ్‌లో భాగంగా ఓ చిన్న కుక్క పిల్లను పెంచసాగాడు. 100 రోజులు పూర్తయిన తర్వాత 101వ రోజు దాన్ని చంపి, బిర్యానీ వండుకుని తినాలని డిసైడ్ అయ్యాడు. రోజూ ఛాలెంజ్‌కు సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఛాలెంజ్ గురించి తెలిసిన కొందరు నెటిజన్లు అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడటం మొదలుపెట్టారు.


ప్రతీ వీడియోకు పెద్ద సంఖ్యలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయినప్పటికీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. 91 రోజులు గడిచిపోయాయి. ఛాలెంజ్ పూర్తయి.. అతడు కుక్క బిర్యానీ వండుకుని తినేందుకు కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. అతడి వీడియోలు ఫాలో అవుతున్నవారు ఎంతో ఉత్కంఠగా ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. 92వ రోజు రానే వచ్చింది. సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్ తగిలింది. కొంతమంది జంతు ప్రేమికులు అతడిని వెతుక్కుంటూ ఇంటి వరకు వెళ్లారు. ఇకపై ఇలాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజ్‌లు చేయకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఆ శునకాన్ని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి

సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..

నా ప్రాణాలకు ముప్పు ఉంది.. షకీల్ అహ్మద్‌

Updated Date - Jan 27 , 2026 | 03:54 PM