Share News

Singer B Praak: రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. సింగర్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా వార్నింగ్

ABN , Publish Date - Jan 17 , 2026 | 01:16 PM

పంజాబ్ గాయకుడు బి ప్రాక్‌‌ను డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు రావడం సంచలనమవుతోంది.

Singer B Praak: రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. సింగర్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా వార్నింగ్
Lawrence Bishnoi and Singer B praak

నూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, పంజాబీ సింగర్ బి ప్రాక్‌(B Praak)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi gang) నుంచి బెదిరింపులు వచ్చాయి. వారం రోజుల్లోగా రూ.10 కోట్లు ఇవ్వకపోతే దారుణమైన పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ ముఠా హెచ్చరించింది. ప్రాక్ సహోద్యోగి, గాయని దిల్నూర్(Dilnoor)కు ఫోన్ కాల్స్, ఒక వాయిస్ మెసేజ్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి.


టైమ్‌లైన్ ఇదే..

జనవరి 5వ తేదీన దిల్నూర్ మొబైల్‌కు అంతర్జాతీయ నంబర్ నుంచి రెండు సార్లు కాల్స్ వచ్చాయి. అయితే.. ఆమె స్పందించలేదు. మరుసటి రోజు మళ్లీ కాల్ రావడంతో ఆమె క్లుప్లంగా సమాధానమిచ్చి, అనుమానం రావడంతో కాల్‌ను కట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జు బిష్ణోయ్ పేరుతో ఆమెకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది.


ఆడియోలో ఏముందంటే..

'హలో, అర్జు బిష్ణోయ్ మాట్లాడుతున్నాను. మాకు రూ.10 కోట్లు కావాలని బి ప్రాక్‌కు చెప్పు. మీకు వారం రోజులు గడువు ఇస్తున్నాం. మీరు ఏ దేశానికి పారిపోయినా అతనితో పాటు ఉండే ఎవర్నీ విడిచిపెట్టం. ఇది ఫేక్ మెసేజ్ అనుకోవద్దు. డబ్బు ఇవ్వకుంటే అతన్ని మట్టిలో కలిపేస్తాం' అని ఆ ఆడియోలో హెచ్చరించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన దిల్నూర్ జనవరి 6న మొహాలి ఎస్ఎస్‌పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. క్రిమినల్ గ్యాంగ్‌తో సంబంధమున్న ఎక్స్‌టార్షన్ కేసుగా పరిగణించిన పోలీసులు.. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

10 మంది సభ్యులతో విజయ్ ప్రచార కమిటీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 17 , 2026 | 01:31 PM