Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా..
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:20 AM
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావో కీలక నేత పాపారావు టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.
ఛత్తీస్‌గఢ్, జనవరి 17: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్(Chhattisgarh Encounter) జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్ట్ కీలక నేత పాపారావు టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు ఏకే-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం.. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా.. ఈ ఏడాది మొదట్లోనే పలు ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల లొంగుబాట్లు జరిగాయి. జనవరి 3న సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. సుక్మాలో 12 మంది, బీజాపూర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో కొంటా ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్ వెట్టి మంగడు వంటి కీలక నాయకులు ఉన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో ఏకే-47, ఇన్‌సాస్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు.. జనవరి 15న బీజాపూర్ జిల్లాలో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. అలాగే.. జనవరి 14న సుక్మాలో 29 మంది, జనవరి 8న దంతేవాడాలో 63 మంది, జనవరి 7న సుక్మాలో 26 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. భద్రతా బలగాలు.. ఐఈడీలు, మావోయిస్ట్ డంప్‌లు స్వాధీనం చేసుకున్నాయి. జనవరి 14న బీజాపూర్‌లో రెండు ఐఈడీలు, రేషన్ స్టాక్‌లను రికవరీ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
Read Latest National News And Telugu News