Garudavega Courier Services: అమెరికాకు మా సేవల్లో అంతరాయం లేదు: గరుడ వేగ
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:18 PM
అంతర్జాతీయ లాజిస్టిక్స్, క్రాస్-బోర్డర్ షిప్పింగ్ సంస్థ గరుడవేగ సర్వీసులు అమెరికాకు యధాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఆగస్టు 29న డి మినిమిస్ రూల్ రద్దు చేసిన తరువాత సవరించిన అమెరికా కస్టమ్స్ మార్గదర్శకాలను అనుసరిస్తూ యూఎస్‌ఏకు తన షిప్పింగ్ సేవలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
అంతర్జాతీయ లాజిస్టిక్స్, క్రాస్-బోర్డర్ షిప్పింగ్ సంస్థ గరుడవేగ తమ సర్వీసులు అమెరికాకు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఆగస్టు 29న డి మినిమిస్ రూల్ రద్దు చేసిన తరువాత సవరించిన అమెరికా కస్టమ్స్ మార్గదర్శకాలను అనుసరిస్తూ యూఎస్‌ఏకు తన షిప్పింగ్ సేవలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది (Garudavega Courier Services).
తమ సంస్థ కార్యకలాపాలు అమెరికా కస్టమ్స్ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉండటమే కాకుండా, ప్రతి పార్సిల్‌ను కొత్త విధానాలకు అనుగుణంగానే డెలివరీ చేయనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కస్టమర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం అమెరికాకి పార్సిల్‌లు పంపేటప్పుడు సవరించిన మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించాలని సూచించారు.
'అమెరికాకి మా సేవల్లో ఎలాంటి అంతరాయం లేదు. కొత్త నిబంధనలు కొన్ని అదనపు అవసరాలను తీసుకువచ్చినా, గరుడవేగ వాటిని పూర్తిగా అనుసరిస్తోంది. కస్టమర్లకు సహాయం అందించేందుకు మా సిబ్బంది, బ్రాంచ్ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి. షిప్మెంట్ల ప్రాసెసింగ్ సాఫీగా సాగేందుకు మేము పూర్తి స్థాయి మార్గనిర్దేశం చేస్తామ`ని గరుడ వేగ సంస్థ ప్రకటించింది. ఏవైనా సందేహాలు, వివరణల కోసం సమీపంలోని బ్రాంచ్ లేదా సిబ్బందిని సంప్రదించవచ్చని సూచించింది.
మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి:
గరుడవేగ – నెక్స్జెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
Garudavega – Nexgen Logistics Pvt. Ltd.
వెబ్‌సైట్: www.garudavega.com
కస్టమర్ కేర్: +91 9059958342
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి