Home » Teachers Day
గతంలో పట్టణాలు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ఉంటుందనుకునే గంజాయి, డ్రగ్స్ ఇప్పుడు గ్రామాల వరకూ చేరాయని, పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ కనిపెట్టాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచన చేస్తు్న్నట్లు చెప్పారు.
వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలు పోస్ట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకొని ఉపాధ్యాయులు సంతోషిస్తారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనది. ఉపాధ్యాయులు పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా, విద్యార్థుల జీవితాలను అందంగా తీర్చిదిద్దే వాస్తుశిల్పులు కూడా..
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు మొత్తం 45 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.
ప్రస్తుత విధానంలో టీచర్ల బదిలీలపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా చేయాలా.. లేదా? చేస్తే ఏ సమయంలో చేయాలనేదానిపై గందరగోళం నెలకొంది.
పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.