National Best Teacher Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:46 PM
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు మొత్తం 45 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 25: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్-2025ను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు వివిధ రాష్ట్రాలకు చెందిన 45 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ కు చెందిన మారం పవిత్ర ఈ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2025కు తెలంగాణ నుంచి 150మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈమె ఒక్కరే ఎంపికయ్యారు.
కేంద్ర విద్యాశాఖ ఈ అవార్డులను సోమవారం ప్రకటించింది. మారం పవిత్ర 2023లోనూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవార్డును సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..