Home » New Delhi
ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు అన్నీ నేటి అర్ధరాత్రి వరకూ రద్దయినట్టు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. అయితే, మధ్యాహ్నం మూడు గంటల వరకే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టు డీజీసీఏ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురు నిందితులకు ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
బిహార్లో కాంగ్రెస్ పరాజయంపై ఇటీవల కూడా ఇందిరాభవన్లోనూ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థలను అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇటీవల బిష్ణోయ్ను 11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఎన్ఐఏ తరఫున అడ్వకేట్ కుష్దీప్ గౌర్తో కలిసి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి శనివారంనాడు విచారణ ముందుకు హాజరయ్యారు.
ఇథియోపియా అగ్నిపర్వతం బద్దలవడంతో ఎగసిపడ్డ బూడిద మేఘాలు ఢిల్లీ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇవి వేల అడుగుల ఎత్తులో ఉండటంతో నగరంలో గాలి నాణ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాంగ్రెస్ 'మహా ర్యాలీ' వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి (కేసీ వేణుగోపాల్) వివరిస్తూ, డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.
బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్లో అన్మోల్ పాత్రను ఎన్ఐఏ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి కోర్టుకు వివరించారు. ఈ నెట్వర్క్లో అన్మోల్ కీలక సభ్యుడని తెలిపారు.