Share News

భారత్ నుంచి గ్లోబల్ AI విప్లవం.. 'hackCBS 8.0' వేదికగా వెల్లడైన సంచలన నిజాలు

ABN , Publish Date - Jan 30 , 2026 | 08:20 AM

భారతదేశంలో విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద హ్యాకథాన్‌గా గుర్తింపు పొందిన hackCBS 8.0 ముగిసింది. ఇందులో భారతీయ యువత రూపొందించిన ఏఐ పరిష్కారాల స్థాయి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

భారత్ నుంచి గ్లోబల్ AI విప్లవం.. 'hackCBS 8.0' వేదికగా వెల్లడైన సంచలన నిజాలు
India AI revolution

న్యూఢిల్లీ, జనవరి 30: భారతదేశపు అతిపెద్ద స్టూడెంట్ హ్యాకథాన్ 'hackCBS 8.0' ఇటీవల ముగిసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటి మేజర్ లీగ్ హ్యాకింగ్ (MLH) ఈవెంట్‌గా గుర్తింపు పొందిన ఈ వేదికపై భారతీయ విద్యార్థులు సృష్టించిన AI ఆవిష్కరణలు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నాయి. ఈ ఈవెంట్‌కు జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రణయ్ మండదపు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.


అమెరికాకు ధీటుగా భారతీయ మేధస్సు:

అక్టోబర్ 2025లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక 'కాల్‌హ్యాక్స్' (CalHacks)లో మెంటార్‌గా వ్యవహరించిన ప్రణయ్‌కు ఢిల్లీలో జరిగిన hackCBS ఆశ్చర్యాన్ని, అనుభూతుల్ని కలిగించింది.

దీనిపై ప్రణయ్ స్పందిస్తూ.. 'అమెరికాలో వనరులు, పెట్టుబడులు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఇక్కడ భారతీయ విద్యార్థులు పరిమిత వనరులతోనే అమెరికా ప్రమాణాలకు తగ్గట్టుగా AI సొల్యూషన్స్‌ను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా అటానమస్ డెసిషన్ మేకింగ్ (స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకోవడం) ఎథికల్ AI రంగాల్లో వారు చూపిస్తున్న పరిణతి అద్భుతం' అని ప్రణయ్ ప్రశంసించారు.

హ్యాకథాన్ విశేషాలు:

ఈ హ్యాకథాన్‌లో 25 దేశాల నుంచి 700 పైగా కళాశాలలకు చెందిన 4,400మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనరేటివ్ AI (GenAI), ఫిన్‌టెక్, హెల్త్ టెక్, ఇంకా వెబ్-3 అంశాలపై నవకల్పన మీద ఈ ఈవెంట్ జరిగింది. సుమారు $220,000 USD విలువైన బహుమతులు విజేతలకు అందించనున్నారు. మేధో సంపత్తి (IP) రక్షణ కోసం ఒక బృందం రూపొందించిన GenAI సొల్యూషన్ రన్నరప్‌గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది.

విజేత నుంచి జడ్జి వరకు.. ప్రణయ్ ప్రస్థానం

ఈ ఈవెంట్‌కు జడ్జిగా వ్యవహరించిన ప్రణయ్ మండదపు ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం. విశాఖపట్నంలోని గీతం (GITAM) యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే 2019లో డెన్సో గ్రూప్ నిర్వహించిన హ్యాకథాన్‌లో ప్రణయ్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆయన రాసిన 'Gideon' అనే AI కంపానియన్ బుక్ చాప్టర్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అమెరికాలో హెల్త్‌కేర్ AI రంగంలో స్థిరపడిన ఆయన.. మళ్లీ భారత్‌కు వచ్చి యువ ప్రతిభను ప్రోత్సహించడం విశేషం.

భవిష్యత్తు సవాళ్లు

భారతీయ విద్యార్థుల్లో సృజనాత్మకత మెండుగా ఉన్నప్పటికీ, 'స్కేలబిలిటీ' (భారం పెరిగినా సమర్థవంతగా పనిచేయడం) విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. AI సిస్టమ్స్ మరింత స్వతంత్రంగా పనిచేయాలంటే అధునాతన 'కంప్యూట్ రిసోర్సెస్' (Compute Resources) విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. అంతేకాదు, 'భారతీయ విద్యార్థులు రేపటి AI విప్లవానికి మూలస్తంభాలు' అని కూడా ప్రణయ్ మండదపు పేర్కొన్నారు. hackCBS 8.0 వంటి వేదికలు భారత్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఈ ఈవెంట్ నిరూపించింది.


ఇవి కూడా చదవండి..

అజిత్‌ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..

భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు

Updated Date - Jan 30 , 2026 | 08:34 AM