అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:53 PM
మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలట్లు మాట్లాడిన మాటలను డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) ప్రయాణించిన విమానం బారామతిలో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో సహా ఐదుగురు మరణించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్ జెట్ 45 విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు.. కాక్‌పిట్‌లో భీతావహ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.
జరగబోయే ఘోర ప్రమాదాన్ని చివరి క్షణాల్లో గమనించిన వెంటనే ఆందోళనతో పైలట్లు ‘ఓహ్ షి**’ అన్నట్టుగా కాక్ పిట్‌లో( DGCA cockpit audio) రికార్డయ్యాయి. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో అజిత్ పవార్‌తో సహా విమానంలో ఉన్నవారంతా విగతజీవులుగా మారారు. ‘ఓహ్ షి**’ అనేవే వారి చివరి మాటలుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు నిర్ధారించారు.
మరోవైపు ప్రమాద ఘటన (Plane Crash)పై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టింది. బ్లాక్ బాక్స్‌ను విశ్లేషిస్తోంది. ఇది విమాన ప్రయాణం గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం. విమాన సమాచారాన్ని రికార్డు చేయడంతోపాటు అది కూలడానికి ముందు కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణలు, అక్కడి నుంచి వెలువడిన శబ్దాలను కూడా నమోదు చేస్తుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆయన పీఎస్ఓ, వ్యక్తిగత సిబ్బందితో పాటు పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ మరణించిన విషయం తెలిసిందే. విమానం ల్యాండ్ కావడానికి చేసిన రెండో ప్రయత్నంలో ఈ ఘోరం జరిగిందని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గీతం యూనివర్సిటీ వద్ద వైసీపీ బృందం నిరసన..
మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..