గీతం యూనివర్సిటీ వద్ద వైసీపీ బృందం నిరసన..
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:24 PM
గీతం యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ జీవీఎంసీ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసే ప్రతిపాదనపై వైపీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భూములు పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు గీతం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.
విశాఖపట్నం, జనవరి 29: గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల భూమి క్రమబద్దీకరణను వైసీపీ వ్యతిరేకిస్తోంది. గురువారం ఆ భూములను పరిశీలించేందుకు విశాఖపట్నంలోని వైసీపీ నేతల బృందం వెళ్లింది. ఈ బృందాన్ని మెయిన్ గేట్ వద్ద గీతం యూనివర్సిటీ భద్రతా సిబ్బంది అడ్డుకుంది. దీంతో ఆ బృందంలోని సభ్యులు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. ఆ బృందాన్ని అక్కడ నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను విశాఖపట్నంలోని వైసీపీ కార్పొరేటర్లతోపాటు స్థానికంగా ఆ పార్టీ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం ఈ భూములు పరిశీలించేందుకు సదరు బృందం గురువారం గీతం యూనివర్సిటీ వద్దకు చేరుకుంది. ఆ బృందం యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..
మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..
For More AP News And Telugu News