విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:32 AM
ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.
హైదరాబాద్, జనవరి 29: గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. పైలట్ వెంటనే అప్రమత్తమై.. ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ విమానంలో నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేత ఏటీసీ అధికారులు తనిఖీ చేయిస్తున్నారు.
దేశంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలి మరణించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో నలుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు బుధవారం నాడు కూడా నార్త్ ఈస్ట్ కొలంబియా(Northeast Colombia)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే నోర్టే డి శాంటాండర్ ప్రావిన్సులో సాటేనా ఎయిర్‌లైన్ బీచ్‌క్రాఫ్ట్ 1900D వాణిజ్య విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవదహనం
For More TG News And Telugu News