Share News

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవదహనం

ABN , Publish Date - Jan 29 , 2026 | 07:16 AM

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవదహనం
Lorry Accident In Kathipudi

కాకినాడ, జనవరి 29: కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 16వ నంబర్ జాతీయ రహదారిపై లారీ యూటర్న్ తీసుకుంటుండగా.. అదే సమయంలో వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఓ లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలార్పేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి బాధ్యుడైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా.. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇక సజీవ దహనమైన డ్రైవర్‌ స్వస్థలం కోల్‌కతా అని పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అండగా నిలవండి

కల్తీ.. కెమికల్‌ నెయ్యి

For More AP News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 10:57 AM