Share News

ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని.. గొంతు కోసుకుని..

ABN , Publish Date - Feb 12 , 2026 | 10:03 PM

ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని ఓ విదేశీయుడు తన గొంతును కోసుకున్నాడు. న్యూఢిల్లీలో బుధవారం ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని.. గొంతు కోసుకుని..
Delhi hotel incident

ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తుర్క్‌మెనిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదన్న కోపంతో గొంతు కోసుకున్నాడు. పహాడ్‌గంజ్ ప్రాంతంలోని వైట్ గ్లో హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జెహ్యూన్ అనే ఫారినర్ గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 10 వరకూ ఆ హోటల్‌లోనే బస చేశాడు. ఆ తరువాత ఫిబ్రవరి 11న మద్యం మత్తులో మళ్లీ హోటల్ వద్దకు వచ్చాడు. తనకు గది ఇవ్వాలని కోరాడు. తన వద్ద డబ్బులు మాత్రం లేవని తెలిపాడు. అయితే, హోటల్‌లో ఆ సమయంలో గదులు ఏవీ ఖాళీగా లేవని సిబ్బంది చెప్పారు.


దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జెహ్యున్ విచక్షణ మరిచి తన వద్ద ఉన్న కత్తితో గొంతును కోసుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే హోటల్ మేనేజ్‌మెంట్ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు అక్కడకు చేరుకుని అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అప్పటికే గాయాలపాలైన అతడికి రకస్రావం ఎక్కువగా అవుతుండటంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని వైద్యులు తెలిపారు.

జెహ్యూ‌న్‌‌కు అంతకుముందు హోటల్ వారితో ఎలాంటి వివాదం లేదని కూడా పోలీసులు గుర్తించారు. అతడు వారికి ఎలాంటి బాకీ పడలేదని కూడా చెప్పారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


ఈ వార్తలూ చదవండి:

తల్లిదండ్రులను చంపిన టెకీ! అమెరికా నుంచి వచ్చి..

చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీసులు.. వీడియో వైరల్

Updated Date - Feb 12 , 2026 | 10:04 PM