Rinku Singh about kohli Bat: కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్.. రింకూ సింగ్ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:03 PM
టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో సతమతమైన రింకూ తిరిగి ఫామ్ అందుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రింకూ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బ్యాట్ అడగడం గురించి మాట్లాడాడు.
టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) ప్రస్తుతం ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో సతమతమైన రింకూ తిరిగి ఫామ్ అందుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రింకూ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని బ్యాట్ అడగడం గురించి మాట్లాడాడు. ఐపీఎల్- 2024 సమయంలో విరాట్ కోహ్లీ బ్యాట్ కోసం రింకూ సింగ్ అతని వెంటే తిరుగుతున్న వీడియోలు బాగా వైరల్ అయ్యాయి (IPL funny story).
'ఆ బ్యాట్ వల్ల నేను కొంచెం అపఖ్యాతి పాలయ్యాను. 2024 ఐపీఎల్ సమయంలో నేను నార్మల్‌గానే కోహ్లీని కలిశాను. కెమెరామ్యాన్ నన్ను అనుసరించేవాడు. కోహ్లీకి, నాకు మధ్య జరిగిన సంభాషణ చూసే వారికి సరిగ్గా అర్థం కాలేదు. ఆ బ్యాట్ వీడియోలు వైరల్ కావడం నాకు, కోహ్లీకి కూడా మంచిది కాదు' అని రింకూ పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 2024లో ఆడిన రింకూ.. కోహ్లీని బ్యాట్ అడిగాడు. కోహ్లీ వెంటనే ఒక బ్యాట్‌ను రింకూకు ఇచ్చాడు. అయితే ప్రాక్టీస్ సమయంలో ఆ బ్యాట్‌ను రింకూ విరిచేశాడు. దాంతో రింకూపై సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి (Rinku Singh Virat Kohli bat).
ఆ తర్వాత మరో బ్యాట్ కోసం కోహ్లీని రింకూ కలిశాడు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో కోహ్లీని బ్యాట్ కోసం రింకూ అనుసరిస్తుండడం వీడియోలో రికార్డ్ అయింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, రింకూకు కోహ్లీ మరో బ్యాట్ కూడా ఇచ్చాడు. కోహ్లీ నుంచే కాదు.. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కూడా తాను బ్యాట్‌లు తీసుకున్నట్టు రింకూ సింగ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..