US Open: యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:46 PM
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ టోర్నీ ఫస్ట్ రౌండ్‌లోనే మాజీ చాంపియన్ డానియల్ మెద్వదేవ్ ఓటమిని ఎదుర్కొన్నాడు. మెద్వదేవ్‌పై ఫ్రెంచ్ ఆటగాడు బెంజిమన్ బాంజీ విజయం సాధించాడు. ఈ మ్యాచ్ సమయంలో ఓ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ టోర్నీ ఫస్ట్ రౌండ్‌లోనే మాజీ చాంపియన్ డానియల్ మెద్వదేవ్ (Daniil Medvedev) ఓటమిని ఎదుర్కొన్నాడు. మెద్వదేవ్‌పై ఫ్రెంచ్ ఆటగాడు బెంజిమన్ బాంజీ విజయం సాధించాడు. ఈ మ్యాచ్ సమయంలో ఓ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. మూడో సెట్‌లో మెద్వదేవ్ ఓడిపోతున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో మెద్వదేవ్ కాస్త శ్రుతి మించి ప్రవర్తించాడు (US Open 2025).
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫొటోగ్రాఫర్ అడ్డురావడంతో చైర్ అంపైర్ మరోసారి బాంజీకి ఫస్ట్ సర్వ్ చేసే అవకాశం ఇచ్చాడు. అప్పటికి 3-6, 5-7, 4-5 స్కోరుతో బాంజీ విన్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో మెద్వదేవ్ హంగామా చేశాడు. ప్రత్యర్థికి మళ్లీ ఫస్ట్ సర్వ్ ఇవ్వడాన్ని నిరసించాడు. తన అరుపులతో స్టేడియంలోని ప్రేక్షకుల్ని రెచ్చగొట్టాడు. దీంతో ప్రేక్షకులు మెద్వదేవ్‌కు అనుకూలంగా అరిచారు. అందువల్ల ఆరున్నర నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఆట ఆరంభమైన తర్వాత మూడో సెట్‌లో బ్రేక్ పాయింట్ సాధించిన మెద్వదేవ్ ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు (US Open drama).
మూడో సెట్‌లో దూకుడును నాలుగో సెట్‌లో కూడా మెద్వదేవ్ కొనసాగించాడు. 0-6 స్కోరుతో ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఓటమి ఖాయనుకున్న దశలో మెద్వదేవ్ వరుసగా రెండు సెట్లు స్వంతం చేసుకుని మ్యాచ్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. అయితే చివరి సెట్‌లో మాత్రం ఫ్రెంచ్ ఆటగాడు బెంజిమన్ బాంజీ సత్తా చాటాడు (Medvedev US Open elimination). 6-4 స్కోరుతో ఆ సెట్‌ను సొంతం చేసుకుని మ్యాచ్ గెలిచాడు. దీంతో మెద్వదేవ్ ఫస్ట్ రౌండ్‌లోనే యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ కోపంలో మైదానంలోనే తన రాకెట్‌ను మెద్వదేవ్ విరగ్గొట్టేశాడు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..