Eagle caught deer: వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:34 PM
ఆకాశంలో అంతెత్తున ఎగిరే గద్దలకు చాలా జంతువులు భయపడతాయి. సాధారణంగా గద్దలు కోడి పిల్లలు, ఇతర పక్షులను, పాములను ఎత్తుకెళ్తుంటాయి. కాస్త బరువున్న వాటిని పట్టుకుని గద్దలు ఎగరలేవని అనుకుంటాం. అయితే గద్ద చాలా శక్తివంతమైనది.
ఆకాశంలో అంతెత్తున ఎగిరే గద్దలకు (Eagle) చాలా జంతువులు భయపడతాయి. సాధారణంగా గద్దలు కోడి పిల్లలు, ఇతర పక్షులను, పాములను ఎత్తుకెళ్తుంటాయి. కాస్త బరువున్న వాటిని పట్టుకుని గద్దలు ఎగరలేవని అనుకుంటాం. అయితే గద్ద చాలా శక్తివంతమైనది. గద్ద కళ్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో, దాని కాళ్లు, నోరు అంతే శక్తివంతంగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Eagle Hunting).
@Crazymoments01 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియో (Viral Video)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. గద్ద ఆహారం కోసం పర్వత ప్రాంతంలో అన్వేషణ సాగిస్తోంది. దాని కంట ఓ జింక పిల్ల పడింది. అంతే.. నేరుగా ఆ జింక పిల్ల దగ్గరకు వచ్చి దానిని తన కాళ్ల గోళ్లతో పట్టుకుని తిరిగి గాల్లోకి ఎగిరిపోయింది. ఆ జింక పిల్ల ఆ గద్ద నుంచి తప్పించుకోలేక తన ప్రాణాలను వదిలేసింది. గద్ద ఇతర జంతువులను వేటాడే టెక్నిక్ అమోఘంగా ఉంటుంది. గద్ద ఏదైనా జంతువును పట్టుకున్న తర్వాత మొదటగా దాని కళ్లు పీకేస్తుంది. దాంతో సదరు జంతువు సగం శక్తిని కోల్పోతుంది. బలహీనమైపోతుంది. ఆ తర్వాత ఆ గద్దకు ఆహారంగా మారిపోతుంది (Eagle caught deer).
ఈ వీడియోను చూస్తే కచ్చితంగా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 26 లక్షల మంది వీక్షించారు. దాదాపు నాలుగు వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..