Trick for Onion Cutting: వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:15 PM
చాలా మంది రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు తమదైన శైలిలో పరిష్కారాలు కనిపెడుతుంటారు. వాటిల్లో ఆలోచింపజేసేవి కొన్ని అయితే, నవ్వు తెప్పించేవి మరికొన్ని. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మనదేశంలో సామాన్యులు కూడా విచిత్రంగా ఆలోచిస్తుంటారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు తమదైన శైలిలో పరిష్కారాలు కనిపెడుతుంటారు. వాటిల్లో ఆలోచింపజేసేవి కొన్ని అయితే, నవ్వు తెప్పించేవి మరికొన్ని. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ ఉల్లిపాయలు కట్ (Onion Cutting) చేయడానికి ఓ కొత్త టెక్నిక్ కనిపెట్టింది.
@HinduHunDilse అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ ఉల్లిపాయలు కోసే ముందు ఓ విచిత్రమైన ఏర్పాటు చేసుకుంది. తన కళ్లకు తెల్లటి టేప్ అంటించుకుంది. సాధారణంగా ఉల్లిపాయలు కోసే సమయంలో కళ్లు మండడం వల్ల నీళ్లు వస్తాయనే సంగతి తెలిసిందే. అందుకే ఆ మహిళ తన కళ్లకు టేప్ అంటించుకుని ఉల్లిపాయలు కోస్తోంది. దీంతో ఆమె కళ్ల నుంచి నీళ్లు రావడం లేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.75 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేయి కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఉల్లిపాయలను కోసే ఈ టెక్నిక్ దేశం వెలుపలికి వెళ్లకూడదు అని ఒకరు కామెంట్ చేశారు. ఈ టెక్నిక్ చూస్తే నాసా కూడా ఆశ్చర్యపోతుందేమో అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. ఇలాంటి తెలివైన మహిళలు భారతదేశంలోనే పుడతారు అని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో స్పైడర్ ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..