Crocodile Attack Video: వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Aug 18 , 2025 | 03:46 PM
మొసలి నోటి నుంచి ప్రాణాలతో బయటపడడం అంటే ఎంతో అదృష్టవంతుల కిందే లెక్క. తాజాగా ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ వీడియోలో ఆ వ్యక్తికి మొసలికి ఆహారం అందించడానికి వెళ్లాడు. అయితే ఊహించని అనుభవం ఎదురుకావడంతో త్రుటిలో ప్రాణాలను దక్కించుకున్నాడు.
నీటిలోని మొసలి (Crocodile) అత్యంత భయంకరమైన జంతువు. నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. మొసలి నోటి నుంచి ప్రాణాలతో బయటపడడం అంటే ఎంతో అదృష్టవంతుల కిందే లెక్క. తాజాగా ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ వీడియోలో ఆ వ్యక్తికి మొసలికి ఆహారం అందించడానికి వెళ్లాడు. అయితే ఊహించని అనుభవం ఎదురుకావడంతో త్రుటిలో ప్రాణాలను దక్కించుకున్నాడు (Crocodile Attack Video).
@Brutal_0s అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తన చేతిలో కోడి మాంసం పట్టుకుని మొసలికి ఆహారం పెట్టడానికి వెళ్తున్నాడు. మొసలి ఉన్న చెరవులోకి దిగాడు. అయితే మొసలి దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా మాంసానికి బదులుగా ఆ వ్యక్తిపై దాడికి దిగింది. అతడిని వెంబడిస్తూ గట్టు కూడా ఎక్కేసింది. దీంతో అక్కడ నిలబడి ఉన్న వారందరూ హడలిపోయారు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని కాపాడాడు.
ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 68 లక్షల మంది వీక్షించారు. పది వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. మొసలి చాలా ఆకలిగా ఉందని, చిన్న మాంసం ముక్క దానికి సరిపోలేదని ఒకరు కామెంట్ చేశారు. ఇది నిజంగా షాకింగ్ అనుభవం అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. వీడియో చూస్తే భయపడాల్సిందే.. ఈమె బల్లులతో ఏం చేస్తోందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..