Lizards Video: వామ్మో.. వీడియో చూస్తే భయపడాల్సిందే.. ఈమె బల్లులతో ఏం చేస్తోందో చూడండి..
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:37 PM
సాధారణంగా బల్లులంటే చాలా మంది భయపడతారు. తరచుగా ఇళ్లలో తిరిగే బల్లుల జోలికి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు. అవి ఎలాంటి హానీ తలపెట్టకపోయినప్పటికీ వాటి శరీరం విషపూరితం కావడంతో వాటి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లోకి బల్లులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు.
సాధారణంగా బల్లులంటే (Lizards) చాలా మంది భయపడతారు. తరచుగా ఇళ్లలో తిరిగే బల్లుల జోలికి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు. అవి ఎలాంటి హానీ తలపెట్టకపోయినప్పటికీ వాటి శరీరం విషపూరితం కావడంతో వాటి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లోకి బల్లులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరూ బల్లులను పెంచుకోవడానికి ఇష్టపడరు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
@Babaxwale అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను చైనా (China)లో చిత్రీకరించారు. ఆ వీడియోలో ఒక మహిళ తన ఇంటి లోపలి దృశ్యాన్ని చూపించింది. ఆమె తన ఇంట్లో విపరీతంగా బల్లులను పెంచుకుంటోంది. ఆమె ఒక కర్టెన్ తీసి చూపించగా దాని లోపల వందల కొద్దీ బల్లులు కనబడుతున్నాయి. ఆ దృశ్యం చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఆమె మాత్రం ఎలాంటి భయమూ లేకుండా బల్లులతో స్నేహపూర్వకంగా మెలుగుతోంది. ఆమె అలా బల్లులను పెంచుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది (Farming lizards in China).
ఇటీవలి కాలంలో గెక్కో, మానిటర్ లిజార్డ్ వంటి బల్లుల పెంపకం చైనాలో చాలా వేగంగా పెరుగుతోంది. ఈ బల్లులను సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఎక్కువగా వాడతారు. ఈ బల్లులను రోగనిరోధక శక్తిని పెంచే మందులు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మందులలో ఉపయోగిస్తారు. దీంతో ఈ బల్లులకు చాలా డిమాండ్ ఉంది. దీంతో చాలా మంది ఇలా ప్రత్యేక పద్ధతుల ద్వారా బల్లులను పెంచి మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఇది ప్రస్తుతం చైనాలో చాలా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇతను మామూలు దొంగ కాదు.. తాళం కప్పను విడగొట్టడానికి ఎలాంటి ట్రిక్ వాడాడో చూడండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి స్వామి.. పాత బల్బును ఎలా మార్చేశారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..