Lock breaking trick: వామ్మో.. ఇతను మామూలు దొంగ కాదు.. తాళం కప్పను విడగొట్టడానికి ఎలాంటి ట్రిక్ వాడాడో చూడండి..
ABN , Publish Date - Aug 15 , 2025 | 09:22 AM
దొంగల నుంచి తమ విలువైన వస్తువులను, సంపదలను రక్షించుకోవడానికి అందరూ తమ ఇళ్లకు తాళం కప్పలు వేసుకుంటారు. ఇంటికి తాళం వేస్తే సురక్షితమని భావిస్తారు. అయితే తాజాగా ఓ దొంగ ఎలాంటి పరికరం లేకుండానే తాళం కప్పను పగలగొట్టే వింత ట్రిక్‌ను చూపించాడు.
దొంగల (Thief) నుంచి తమ విలువైన వస్తువులను, సంపదలను రక్షించుకోవడానికి అందరూ తమ ఇళ్లకు తాళం కప్పలు (Lock) వేసుకుంటారు. ఇంటికి తాళం వేస్తే సురక్షితమని భావిస్తారు. అయితే దొంగలు కొత్త కొత్త టెక్నిక్‌లు ఉపయోగించి మరీ తాళం కప్పలను పగలగొడుతున్నారు. ఉలి, సుత్తి, ఇతర పరికరాలు ఉపయోగించి కప్పలను పగలగొడుతుంటారు. అయితే తాజాగా ఓ దొంగ ఎలాంటి పరికరం లేకుండానే తాళం కప్పను పగలగొట్టే వింత ట్రిక్‌ను చూపించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Trick to breaking Lock).
flirting.lines అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో పోలీసులకు దొరికిపోయిన ఓ దొంగ తాను తాళం కప్పను ఎలా పగలగొట్టిందీ వివరించి చెబుతున్నాడు. అతడి చేతిలో ఓ సిరెంజీ ఉంది. ఆ సిరెంజీలో పెట్రోల్ ఉంది. ఆ పెట్రోల్‌ను సిరంజీ ద్వారా తాళం కప్ప కీహోల్ లోపలికి పంపించాడు. అనంతరం లైటర్ ద్వారా మంట పెట్టాడు. కాసేపు ఆ తాళం కప్ప మంటలో కాలిన తర్వాత చిన్నగా కొడితే అది ఊడిపోయింది. తాళం కప్ప కీహోల్‌లో ఉండే సన్నని ప్లాస్టిక్ పొర మంట తగలడం వల్ల కరిగిపోయింది. దీంతో వెంటనే కప్ప ఊడిపోయింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు పది లక్షల మంది వీక్షించారు. 1.3 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇండియా దొంగలు చాలా తెలివైన వాళ్లని ఒకరు కామెంట్ చేశారు. ఇంటికి తాళం కప్పలు కూడా భద్రం కాదని దీనిని బట్టి అర్థమవుతోందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎంత పెద్ద పామైనా ముంగిస ముందు బలాదూర్.. థ్రిల్లింగ్ ఫైట్‌లో ఏం జరిగిందో చూడండి..
పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..