Snake Mongoose Fight: ఎంత పెద్ద పామైనా ముంగిస ముందు బలాదూర్.. థ్రిల్లింగ్ ఫైట్‌లో ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Aug 13 , 2025 | 08:31 PM
పాములంటే మనుషులే కాదు.. అడవిలోని క్రూర జంతువులు కూడా భయపడతాయి. విష సర్పం కాటేసిందంటే క్షణాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అందుకే సింహం, పులులు వంటి జంతువులు కూడా పాములంటే భయపడతాయి. అంతటి భయంకర విష సర్పాలకు ముంగిసలు చెమటలు పట్టిస్తాయి.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snake) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. పాములంటే మనుషులే కాదు.. అడవిలోని క్రూర జంతువులు కూడా భయపడతాయి. విష సర్పం కాటేసిందంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అందుకే సింహం, పులులు వంటి జంతువులు కూడా పాములంటే భయపడతాయి. అంతటి భయంకర విష సర్పాలకు ముంగిసలు (Mongoose) చెమటలు పట్టిస్తాయి. పాము, ముంగిసల మధ్య జాతి వైరం ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) పాము, ముంగిసల మధ్య భీకర యుద్ధం జరిగింది. ముంగిస, భారీ సర్పం హోరాహోరీగా తలపడ్డాయి (Snake Mongoose Fight). పాము కాటు నుంచి తప్పించుకునేందుకు ముంగిస గొప్ప టెక్నిక్ ఉపయోగించింది. అలాగే ముంగిస తలను పట్టుకుని కదలకుండా చేసినా సరే.. పాము పోరాటం కొనసాగించింది. కాసేపు అచేతనంగా ఉండిపోయి తిరిగి ముంగిస పట్టు నుంచి తప్పించుకుంది. అయినా ముంగిస ఆ పామును వదల్లేదు. పాము తలను తన నోటితో పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు రెండు లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ రెండు జంతువుల మధ్య వైరం శతాబ్దాల నాటిదని ఒకరు కామెంట్ చేశారు. ఎంత పెద్ద పామైనా ముంగిసను ఏమీ చేయలేదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ గడ్డిలో పురుగు కనబడిందా.. మీ కళ్లకు ఇక తిరుగులేనట్టే..
పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..