Fly helped a golfer: ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:01 PM
దర్శకుడు రాజమౌళి తీసిన ఈగ సినిమా చూశారా? ఆ సినిమాలో ఈగ ఎన్నో కష్టసాధ్యమైన పనులను చేసేస్తుంటుంది. తన శరీర బరువు కంటే పెద్దవైన వాటిని మోసేస్తుంది. ఆ ఈగను రాజమౌళి గ్రాఫిక్స్‌లో సృృష్టించారు. అయితే తాజాగా నిజంగానే ఓ ఈగ అద్భుతం చేసింది.
దర్శకుడు రాజమౌళి తీసిన ఈగ సినిమా చూశారా? ఆ సినిమాలో ఈగ (Fly) ఎన్నో కష్టసాధ్యమైన పనులను చేసేస్తుంటుంది. తన శరీర బరువు కంటే పెద్దవైన వాటిని మోసేస్తుంది. ఆ ఈగను రాజమౌళి గ్రాఫిక్స్‌లో సృష్టించారు. అయితే తాజాగా నిజంగానే ఓ ఈగ అద్భుతం చేసింది. ఓ గోల్ఫర్ (Golfer)కు ఏకంగా రూ.కోట్లు సంపాదించిపెట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @ashfaque80035 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (Fly helped a golfer).
వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video) ప్రకారం.. ఒక గోల్ఫ్ క్రీడాకారుడు షాట్ కొట్టాడు. అయితే బంతి హోల్ అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రేక్షకులు, ఆటగాడు బంతి బయటే ఆగిపోయిందని భావించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా, ఒక ఈగ వచ్చి బంతిపై కూర్చుంది. ఈగ స్వల్ప బరువు కారణంగా, బంతి నెమ్మదిగా జారి నేరుగా హోల్‌లో పడిపోయింది. దీంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఆ గోల్ఫ్ క్రీడాకారుడి అదృష్టం మారిపోయింది. అతడు ఆనందంతో సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు.
ఆ ఈగ చేసిన సహాయం వల్ల ఆ గోల్ఫర్ విజేతగా నిలిచి ఏకంగా 8 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అదృష్టం ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. తాబేళ్ల మధ్యనున్న కప్పను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..