Pawan Kalyan Teachers Day Message: ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:03 PM
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకొని ఉపాధ్యాయులు సంతోషిస్తారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. ‘శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకొని ఉపాధ్యాయులు సంతోషిస్తారు. తల్లితండ్రులతోపాటు విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా పూజించే సంస్కృతి మనది. నేడు గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు అకడమిక్ సంబంధిత అంశాలతోపాటు నైతిక విలువలు కూడా నేర్పించాలని ఉపాధ్యాయులను కోరుతున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకం చేపట్టింది. డీఎస్సీ నియామకంతో విధుల్లోకి రాబోతున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలియచేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లా పర్యటన రద్దు..
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలో గల మదగడ గిరిజన గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయింది. ప్రభుత్వం పరంగా కార్యక్రమాలు, సమావేశాలతో బిజీగా ఉండటంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. మదగడ గిరిజన గ్రామాన్ని ఇవాళ(శుక్రవారం) సందర్శిస్తానని ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో ఆయన పాల్గొనాల్సి ఉంది. బిజీ షెడ్యూల్ కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోసారి తప్పకుండా ఆ గ్రామానికి వెళ్లి ప్రజలను పవన్ కల్యాణ్ కలుస్తారని జనసేన నేతలు తెలిపారు. ఈ మేరకు జనసేన హై కమాండ్ ఓ ప్రకటన విడదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
Read Latest Andhra Pradesh News and National News