Share News

YSRCP Social Media Misuse ON Teachers: రాజకీయ లబ్ధి కోసం టార్గెట్ చేస్తారా.. వైసీపీపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:33 PM

వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలు పోస్ట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

YSRCP Social Media Misuse ON Teachers: రాజకీయ లబ్ధి కోసం టార్గెట్ చేస్తారా.. వైసీపీపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం
YSRCP Social Media Misuse ON Teachers

అమరావతి, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా (YSRCP Social Media) హ్యాండిల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు (Teacher Unions Leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు (Teachers Day) తమను కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలను వైసీపీ నేతలు తప్పుగా పోస్ట్ చేయడంపై ధ్వజమెత్తారు. సమాజ నిర్మాతలైన ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజు అవమానించేలా పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ ఏపీ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


దుర్మార్గమైన వైసీపీ పోస్టును ఖండిస్తూ ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఉపాధ్యాయ సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. సమాజ నిర్మాతల పట్ల ఇంత అగౌరవంగా ప్రవర్తించిన వారు ఏ పార్టీ వారైనా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. విద్య నేర్పే గురువుల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించిన వారికి మద్దతు ఇస్తున్న పార్టీలను తుద ముట్టించాలని మందలించారు. ఓటు అనే ఆయుధంతో అలాంటి వారికి మద్దతు ఇస్తున్న వారికి బుద్ది చెబుతామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 12:39 PM