Home » YSRCP Social Media
సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు.
బందరు మండలం సత్రంపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ కార్యకర్త, ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ఏపీ ప్రభుత్వ అద్దె హెలికాఫ్టర్‌పై వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగింది. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రికి గతంలో ఉన్న హెలికాఫ్టర్ స్థానంలోనే వేరే హెలికాఫ్టర్‌ను అద్దెకు తెప్పిస్తున్నారని ఏపీ ప్రభుత్వ అధికారులు వివరించారు.
వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలు పోస్ట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం వైసీపీ శ్రేణులకు అలవాటుగా మారిపోయింది.
అంతా నీచమే! పేటీఎం ఫేక్ బతుకులే! విపక్ష నేతలపై బురదచల్లేందుకు తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ‘ఆంధ్రజ్యోతి’, ‘వే టు న్యూస్’ వంటి ప్రముఖ మీడియా లోగోలు వాడుకోవడం! ఇదే పాడు పద్ధతి! సొంత రోత మీడియాను నమ్మరనీ, దానికి విశ్వసనీయత లేదని వారికీ