AP Police Action On YCP:వైసీపీ తప్పుడు ప్రచారంపై ఏపీ పోలీసుల యాక్షన్
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:26 PM
సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు.
తిరుపతి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా (Social Media)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt)పైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ (YSRCP) సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు. ఇవాళ(మంగళవారం) మీడియాతో ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి మాట్లాడారు. ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా సమాచారాన్ని సేకరించి, ఆధారాలను పరిశీలించామని వెల్లడించారు ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి.
విక్టరీ వైన్స్, కపిలతీర్థం వద్ద ఒక వ్యక్తి మద్యం తాగి పడిపోతే అది కల్తీమద్యంతో అని వైసీపీ సోషల్ మీడియా పేజీలో తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు. వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు ఎక్సైజ్ శాఖకు చెడ్డపేరు తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పీఏ చంద్రశేఖర్ వెంకటేష్ A1గా, వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బృంగి నవీన్ A2గా గుర్తించామని తెలిపారు. చంద్రశేఖర్ వెంకటేష్ వీడియో తీస్తే, దాన్ని సోషల్ మీడియాలో బృంగి నవీన్ వైరల్ చేశాడని చెప్పుకొచ్చారు ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి.
నిన్న(సోమవారం) రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేశామని వివరించారు. తమ వద్ద డిజిటల్ ఏవిడెన్స్ ఉన్నాయని .. వాటి ఆధారంగా విచారణ జరిపి, అరెస్ట్ చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఏమైనా పెట్టొచ్చని అనుకుంటే పొరబాటు అని... వాస్తవాలను వక్రీకరించి చూపితే, అలాంటి వారిపై విచారణ జరిపి, కటకటాల్లోకి పంపుతామని హెచ్చరించారు. భావప్రకటనకు తాము అడ్డుకోబోమని.. ఆ ముసుగులో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News