Share News

YSRCP Fake Campaign: మరోసారి వైసీపీ ఫేక్ ప్రచారం.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 02:57 PM

ఏపీ ప్రభుత్వ అద్దె హెలికాఫ్టర్‌పై వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగింది. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రికి గతంలో ఉన్న హెలికాఫ్టర్ స్థానంలోనే వేరే హెలికాఫ్టర్‌ను అద్దెకు తెప్పిస్తున్నారని ఏపీ ప్రభుత్వ అధికారులు వివరించారు.

YSRCP Fake Campaign: మరోసారి వైసీపీ ఫేక్ ప్రచారం.. అసలు విషయమిదే..
YSRCP Fake Campaign

అమరావతి, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వ అద్దె హెలికాఫ్టర్‌పై (AP Government Helicopter) వైసీపీ ఫేక్ ప్రచారానికి (YSRCP Fake Campaign) దిగింది. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. అద్దె హెలికాఫ్టర్‌‌పై వైసీపీ ఫేక్ ప్రచారంపై ప్రభుత్వ అధికారులు అన్ని విషయాలను కూలంకషంగా వివరించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ముఖ్యమంత్రికి గతంలో ఉన్న హెలికాఫ్టర్ స్థానంలోనే వేరే హెలికాఫ్టర్‌ను అద్దెకు తెప్పిస్తున్నారని వివరించారు ఏపీ ప్రభుత్వ అధికారులు.


ఏపీ ప్రభుత్వం కొత్త హెలికాఫ్టర్ కొనుగోలు చేయలేదని, గతంలో ఎలాగైతే అద్దె చెల్లింపు ద్వారా హెలికాఫ్టర్ వాడుతున్నారో ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతున్నారని స్పష్టం చేశారు. అద్దెకు తీసుకునే చాఫర్ మోడల్, కంపెనీ మార్చారు తప్పా.... కొత్తది కొనుగోలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అద్దెకు తీసుకునే చాఫర్ గతంలో వాడే దానికంటే కొంచెం అధునాతనమైనదని తెలిపారు ఏపీ ప్రభుత్వ అధికారులు. దీనిలో నేరుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా ప్రయాణం చేయొచ్చని వెల్లడించారు. భద్రత పరంగా కూడా గత హెలికాఫ్టర్ కంటే కొంచెం మెరుగైనదని చెప్పుకొచ్చారు. గతంలో విజయవాడ నుంచి సుదూర ప్రాంతాలకు, చిట్టచివరి జిల్లాలకు వెళ్లాలంటే.. కొంత దూరం విమానం, తర్వాత హెలికాఫ్టర్ వాడే వాళ్లని వివరించారు ఏపీ ప్రభుత్వ అధికారులు.


దీని వల్ల అదనంగా ఖర్చు అవ్వడంతో పాటు ఎక్కువ సమయం పట్టేదని వెల్లడించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో ముందుగా విశాఖపట్నం లేదా తిరుపతి లేదా కడప, కర్నూలు వెళ్లడం...అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో జిల్లాలకు, నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అద్దెకు తీసుకువచ్చిన వేరే కంపెనీ హెలికాఫ్టర్ ద్వారా అమరావతి నుంచి నేరుగా అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు వరకు ప్రయాణం చేయొచ్చని వివరించారు. దీని వల్ల ప్రభుత్వ కాన్వాయ్‌లు, విమాన ఖర్చులు కూడా మిగులుతాయని తెలిపారు ఏపీ ప్రభుత్వ అధికారులు.


ఎక్కడా ట్రాఫిక్ నిలిపివేతలు, బందోబస్తు డ్యూటీలు వంటివి కూడా అవసరం ఉండదని స్పష్టం చేశారు. నేరుగా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికే సీఎం అమరావతి నుంచి వెళ్లే అవకాశం ఉండటంతో సమయం కూడా కలిసి వస్తోందని తెలిపారు. భద్రత, ఖర్చు, సౌకర్యంతో పాటు ఇతర అన్ని అంశాలను పరిశీలించి ఈ హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకున్నట్లు వివరించారు. అంతిమంగా ఏంటంటే...హెలికాఫ్టర్ కొత్తది కొనలేదని...అద్దెకు తీసుకునే చాఫర్ మోడల్ మాత్రమే మారిందని వెల్లడించారు. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 03:30 PM