Share News

Police Action on YSRCP Activist: పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN , Publish Date - Sep 12 , 2025 | 06:52 AM

బందరు మండలం సత్రంపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ కార్యకర్త, ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Police Action on YSRCP Activist: పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Police Action ON YSRCP Activist

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బందరు మండలం సత్రంపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) వైసీపీ కార్యకర్త, ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ (YSRCP Activist Giridhar) అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో జనసైనికులు ఆగ్రహంతో గిరిధర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు గిరిధర్.


ఈ క్రమంలో గిరిధర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసైనికులు. తక్షణం గిరిధర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎంపీ వైద్యుడి ఇంటి ముందు జనసైనికులు ధర్నాకు దిగారు. జనసైనికుల ఆగ్రహంతో మోకాళ్లపై నిలబడి క్షమాపణ చెప్పాడు ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్. ఈ విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్నారు కృష్ణాజిల్లా పోలీసులు (Krishna District Police). ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటలకు ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్‌‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు కృష్ణాజిల్లా పోలీసులు. గిరిధర్‌‌ను అదుపులోకి తీసుకోవడంతో జనసైనికులు ఆందోళన విరమించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 12 , 2025 | 10:32 AM