Share News

Palla Srinivasa Rao ON Super Six: భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:21 AM

సూపర్ సిక్స్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.

Palla Srinivasa Rao ON  Super Six: భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు
Palla Srinivasa Rao ON Super Six Meeting

అనంతపురం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ సభ ఘన విజయం సాధించిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) పేర్కొన్నారు. సూపర్ సిక్స్ సభకు రెండు లక్షల మంది వస్తారని అంచనాలు వేసుకుంటే మూడు లక్షలకుపైగా హాజరయ్యారని చెప్పుకొచ్చారు. ప్రజలే తమ బలం, తమ విశ్వాసమని ఉద్ఘాటించారు.


ఇవాళ(గురువారం) అనంతపురంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారని తెలిపారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ఉద్ఘాటించారు పల్లా శ్రీనివాసరావు.


భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. కూటమికి ప్రజలు ఇచ్చిన ఈ విజయానికి గౌరవ వందనం చేస్తున్నామని అన్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు పల్లా శ్రీనివాసరావు.


వైసీపీది విష ప్రచారం..

‘సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ దిగ్విజయంగా సాగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని బెదిరించి ఈ సభకు తాము తీసుకొచ్చామని వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. బెదిరించి వందమందిని తీసుకురావచ్చు... లక్షలాది మంది ప్రజలు ఎలా వస్తారు. మా పాలన విధానాలు సంక్షేమ పథకాలు అమలుపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందుకే అంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సభను దిగ్విజయం చేసిన మూడు పార్టీల నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తొలి ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాం. భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం. భవిష్యత్తులో కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. జగన్ అధికారంలో ఉండగా ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చారా. ప్యాలెస్‌లో ఉంటూ ఫేక్ ప్రచారాలు చేశారు. అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైతుల విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనం మధ్య ఉండే నాయకుడు. జగన్ అసత్యాలు ఎప్పటికీ నెగ్గవు’ అని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్‌ సిక్స్‌.. గ్రాండ్‌ సక్సెస్‌

ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 11 , 2025 | 12:08 PM