Share News

Gottipati Fires on Jagan: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:35 AM

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సభతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిందని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.

Gottipati Fires on Jagan: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి
Minister Gottipati Ravikumar Fires ON YS Jagan

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) పేర్కొన్నారు. ఈ సభతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) దిమ్మ తిరిగిందని విమర్శించారు. జగన్‌కు ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ సభ దెబ్బతో వైసీపీ దుకాణం పూర్తిగా మూతపడినట్లేనని విమర్శించారు గొట్టిపాటి రవికుమార్.


ఇవాళ(గురువారం) అమరావతిలో (Amaravati) మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా కొరతపై రైతు పోరు అంటూ జగన్ అండ్ కో హడావుడి చేస్తే ఒక్క రైతు కూడా వైసీపీకి (YSRCP) మద్దతు తెలపలేదని విమర్శలు చేశారు. వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కాంట్రాక్టర్లను బెదిరించే రీతిలో జగన్, ఆయన అనుచరులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ తన సైకోయిజాన్నిఇంకా మార్చుకోలేదని ధ్వజమెత్తారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఇక కలేనని ఆక్షేపించారు. జగన్‌ డ్రామాలను ప్రజలు ఇక నమ్మరని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్‌ సిక్స్‌.. గ్రాండ్‌ సక్సెస్‌

ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 11 , 2025 | 11:17 AM