Share News

Janasena Kakinada MP: జనసేన ఎంపీకి బిగ్ షాక్.. సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా

ABN , Publish Date - Sep 11 , 2025 | 07:25 AM

కాకినాడ జనసేన ఎంపీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా ఆయన సంస్థకే రూ.92 లక్షలు బురిడీ కొట్టించారు.

Janasena Kakinada MP: జనసేన ఎంపీకి బిగ్ షాక్.. సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా
Janasena Kakinada MP

కాకినాడ: కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ పేరును, ఫొటోను వినియోగించి ఏకంగా ఆయన సంస్థ టీ-టైమ్ నుంచి రూ.92 లక్షలు కాజేశారు.


తెలంగాణలో టీ-టైమ్ సంస్థకు చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ కొత్త ఫోన్ నెంబరు నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ డీపీగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫొటో ఉండటంతో, అది నిజంగానే ఎంపీ మెసేజ్ అని మేనేజర్ నమ్మాడు. కొత్త ఫోన్ నెంబరు ఉపయోగిస్తున్నా.. అత్యవసరం.. కొంత మొత్తం పంపించు అంటూ పదే పదే మెసేజ్‌లు పంపాడు. ఆ మెసెజ్‌లు ఎంపీ ఉదయ్ చేశారని నమ్మిన మేనేజర్, ఎటువంటి క్రాస్ చెక్ చేయకుండా పదకొండు సార్లు మొత్తం రూ.92 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.


మేనేజర్ షాక్

ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను పరిశీలిస్తుండగా, అనుమానాస్పదంగా కొన్ని ట్రాన్సాక్షన్లు కనిపించాయి. వెంటనే ఆయన తన ఫైనాన్స్ మేనేజర్‌ను ప్రశ్నించగా, అసలు తన ఫోన్ నెంబర్ మారలేదని, డబ్బుల కోసం తను ఎటువంటి మెసేజ్ పంపలేదని ఎంపీ స్పష్టం చేశారు. దాంతో మేనేజర్ షాక్‌కు గురయ్యాడు. ఇది సైబర్ మోసమేనని గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, మొదటి నగదు బదిలీ జరిగిన 2 వారాల తర్వాత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు.


Also Read:

పాడేరు సీట్ల తగ్గుదల జగన్‌ నిర్వాకమే

రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా

For More Latest News

Updated Date - Sep 11 , 2025 | 08:37 AM