Share News

Minister Atchannaidu: రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:56 AM

వ్యవసాయశాఖలో సంస్కరణలు, రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

Minister Atchannaidu: రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా

  • జగన్‌కు మంత్రి అచ్చెన్న సవాల్‌

అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖలో సంస్కరణలు, రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఐదేళ్ల పాలనలో పంటలకు మద్దతు ధరలో కోత పెట్టారు. ఉచిత పంటల బీమాకు మూడేళ్లు ప్రీమియం చెల్లించలేదు. రాయితీలు నిలిపివేశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇవ్వలేదు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామన్న జగన్‌.. ఏ పంట, ఏ రైతు నుంచి ఎంత కొనుగోలు చేశారో చెప్పగలరా?. ధాన్యం డబ్బులు ఎగ్గొట్టారు. వైసీపీ పాలనలో ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయాయి. మేము నిరుడు కన్నా అదనంగా ఎరువులు తెప్పించి, పంపిణీ చేశాం. యూరియా దొరకడం లేదంటూ వైసీపీ ఫేక్‌ ప్రచారం చేస్తోంది. బర్లీ పొగాకు, కోకో, మిర్చి, మామిడి, టమాటా, ఉల్లి పంటలకు మద్దతు ధరలు కల్పించి, ఆ పంటల్ని కొనుగోలు చేశాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 06:57 AM