Minister Satyakumar: పాడేరు సీట్ల తగ్గుదల జగన్ నిర్వాకమే
ABN , Publish Date - Sep 11 , 2025 | 07:05 AM
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే మాజీ సీఎం జగన్ విష ప్రచారాన్ని కొనసాగించారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్..
మెడికల్ కాలేజీలపై మాజీ సీఎం విషప్రచారం: మంత్రి సత్యకుమార్
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే మాజీ సీఎం జగన్ విష ప్రచారాన్ని కొనసాగించారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. జాతీయ వైద్య సంఘం 2024-25లో పాడేరు కాలేజీలో ప్రవేశాలను కేవలం 50కే కుదించడానికి మాజీ సీఎం నిర్వాకమే కారణమన్నారు. ఈ విషయంలో ఆయనే పూర్తి దోషి అని చెప్పారు. పీపీపీ విధానంలో నూతన వైద్య కళాశాలల నిర్మాణం, హైబ్రిడ్ విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకాలపై మీడియా సమావేశంలో జగన్ ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు.