Pawan Kalyan Bapatla Tour Cancelled: పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దు
ABN , Publish Date - Sep 11 , 2025 | 08:11 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దయింది. బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో..
బాపట్ల జిల్లా: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేడు ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాపట్లలో పర్యటించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, అటవీ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా సూర్యలంక రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో స్థూపం ఆవిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 23 మంది అటవీ అమర వీరుల కుటుంబాలతో ఆత్మీయంగా సమావేశమై వారికి ఆర్థిక సాయం అందించాలనుకున్నారు. అంతేకాకుండా, రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాళపత్ర గ్రంథం మొక్కలను సూర్యలంక తీర ప్రాంతంలో నాటాలనుకున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
Also Read:
నిమ్స్ కిటకిట.. 3 రోజుల్లో 11,590 మంది రోగుల రాక
జనసేన ఎంపీకి బిగ్ షాక్.. సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా
For More Latest News