Share News

AP IAS, IPS Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు

ABN , Publish Date - Sep 11 , 2025 | 09:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బదిలీలకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంటుంది.

AP IAS, IPS Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు
AP Government

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు సంబంధించిన RT NO 1665 పేరుతో ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది. ఈ నేపధ్యంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో అధికారుల ట్రాన్స్‌ఫర్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో, సర్కార్ బదిలీలను ముందుగానే పూర్తి చేసి ప్రభుత్వ విధుల్లో సజావుగా వ్యవహరించాలని ప్రయత్నిస్తోంది. కాగా, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను ఏడు లేదా పది రోజులపాటు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.


Also Read:

పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దు

జనసేన ఎంపీకి బిగ్ షాక్.. సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా

For More Latest News

Updated Date - Sep 11 , 2025 | 09:27 AM