Home » IPS
సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేసిన రాష్ట్రప్రభుత్వం ఆదివారం వారికి పోస్టింగులు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీకి ప్రభుత్వం ఊరటనిచ్చింది. వారిపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలకు రెండేళ్ల తర్వాత ఊరట లభించింది. ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో 2024 సెప్టెంబరు 15న సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో పీఎస్ఆర్ ఆంజనేయులు మూడు రోజుల క్రితమే రిటైరయ్యారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్ పంపారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. సూసైడ్ నోట్, ఆధారాలున్న ఐఫోన్ మాయమయ్యాయి ఈ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సైబర్ నేరాలను ఎదుర్కోవడం.. కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ అన్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై ఎక్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ వాంగ్మూలాన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు నమోదు చేశారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు వేగం పెంచారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.