IPS పురాన్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్, నోట్ రాసి, సెల్ఫీ వీడియో చేసి సూసైడ్ చేసుకున్న ASI సందీప్
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:06 PM
హర్యానా ఐపీఎస్ పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఇది భారీ ట్విస్ట్. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సైబర్ సెల్‌లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం..
హర్యానా, అక్టోబర్ 14: హర్యానా ఐపీఎస్ పురాన్ ఆత్మహత్య కేసులో ఇది భారీ ట్విస్ట్. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సైబర్ సెల్‌లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ (మంగళవారం) తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. మరణించిన ASI నుండి మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను.. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ IPS అధికారి వై. పురాన్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
ASI తన సూసైడ్ నోట్‌లో, ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ అత్యంత అవినీతికి పాల్పడ్డాడని, అతని అక్రమాలపై తగినన్ని ఆధారాలు ఉన్నాయని తన సూసైడ్ నోట్ లో ఎఎస్ఐ రాశారు. కుల వివక్షను ఉపయోగించుకుని పురాణ్ కుమార్ మొత్తం వ్యవస్థను హైజాక్ చేశాడని, నిజాయితీపరులైన అధికారులను ఎంతో మందిని వేధించాడని ఆయన ఆరోపించారు. నిజం బయటపడేలా ఈ అవినీతిపై దర్యాప్తు కోరుతూ తాను తన ప్రాణాలను త్యాగం చేస్తున్నట్లు ASI తన సూసైడ్ నోట్ లో రాశారు.
కాగా, ASI సందీప్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలోని సైబర్ సెల్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం, సందీప్ మృతదేహం ఒక ఇంట్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు తెల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడు. అతని సర్వీస్ రివాల్వర్ మంచం దగ్గర పడి ఉంది. DSP గులాబ్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కోసం FSL నిపుణుడు డాక్టర్ సరోజ్ దహియాను పిలిపించారు.
ఈ ఘటన తర్వాత, పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్, దివంగత IPS అధికారి వై. పురాణ్ కుమార్‌పై సందీప్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన వీడియో సందేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన సూసైడ్ నోట్‌లో, పురాణ్ కుమార్ అవినీతి అధికారి అని సందీప్ పేర్కొన్నారు. దీనికి చాలా ఆధారాలు ఉన్నాయని కూడా అతను నోట్‌లో రాశాడు. తన అరెస్టుకు భయపడి, ఈ తీవ్రమైన చర్య తీసుకోవాలని సందీప్ నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
For More National News And Telugu News