Fake Liquor Scam నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:53 PM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ చాటింగ్ మంగళవారం లీక్ అయింది.
అమరావతి, అక్టోబర్ 14: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ చాటింగ్ మంగళవారం లీక్ అయింది. తనకు కాల్ చేయాలని జనార్దన్ రావుకు జోగి రమేశ్ మెసేజ్ పెట్టారు.
తన ఇంటికి రావాలంటూ తొలుత మెసేజ్ పెట్టి.. ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావంటూ జనార్దన్ రావును జోగి రమేశ్ అడిగారు. ఒక్కసారి ఫేస్ టైమ్‌లో మాట్లాడాలని జనార్దన్ రావుకు జోగి రమేశ్ మెసేజ్ పెట్టారు. ఈ వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే ప్రస్తుతం మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని మాజీ మంత్రి జోగి రమేశ్ తనను ఆదేశిస్తేనే.. ఈ పనికి పూనుకున్నట్లు ఈ కేసులో నిందితుడు జనార్దన్ రావు ఇప్పటికే వెల్లడించారు. జోగి రమేశ్ ఆదేశాలతోనే గతంలో సైతం నకిలీ మద్యం తయారు చేసేవాడినని చెప్పారు.
కానీ ప్రభుత్వం మారిన తర్వాత నకిలీ మద్యం తయారీని తాను నిలిపి వేసినట్లు జనార్దన్ రావు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు నకిలీ మద్యం తయారు చేయాలని జోగి రమేశ్ ఆదేశాల మేరకే తాను ఈ నకిలీ మద్యం తయారు చేయడం ప్రారంభించానని జనార్దన్ రావు వివరించారు.
అదికూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలోనే ఈ నకిలీ మద్యం తయారు చేయమడం వెనుక ఉన్న గల కారణాలను సైతం జనార్దన్ రావు ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే జోగి రమేశ్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యాన్ని తాను తయారు చేసినట్లు జనార్దన్ రావు ఇటీవల విడుదల చేసిన వీడియాలో వెల్లడించిన విషయం విదితమే.
మరో వైపు ఈ నకిలీ మద్యం కేసు దర్యాప్తును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. కృష్ణా,గోదావరి జిల్లా రేంజ్ డీఐజీ అశోక్ కుమార్‌ను ఈ సిట్‌కు హెడ్‌గా నియమించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కేసులో పురోగతిని ప్రభుత్వానికి తెలియజేయాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
భారత్, పాక్‌లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
For More AP News And Telugu News