Diwali: దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
ABN , Publish Date - Oct 14 , 2025 | 09:15 AM
అమావాస్య మిగులు తగులు రెండు రోజులు ఉంది. ఈ నేపథ్యంలో దీపావళి ఎప్పుడు వచ్చింది. ధన త్రయోదశి ఎప్పుడు చేసుకోవాలి. ఆ రోజు ఏ ఏ వస్తువులు కొనుగోలు చేయాలి.
ఏడాదిలో వచ్చే పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. ఈ వెలుగుల పండగ ఎప్పుడు వస్తుందా? అంటూ చిన్న పెద్ద అంతా వయస్సుతో నిమిత్తం లేకుండా తెగ ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ పండగ 20న జరుపుకోవాలా? లేకుంటే 21న జరుపుకోవాలా అనే సందిగ్ధత పలువురిలో నెలకొంది. ఎందుకంటే రెండు రోజుల్లో అమావాస్య తిథి ఉండడంతో పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పండితులు స్పష్టత ఇచ్చారు. దీపావళి పండగ.. అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని వారు చెబుతున్నారు.
అమావాస్య తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 2. 40 గంటలకు ప్రారంభమవుతుంది. మరునాడు అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ అమావాస్య ఘడియలు ముగియనున్నాయి. సూర్యాస్తమయానికి అమావాస్య అక్టోబర్ 20వ తేదీనే ఉంది. కాబట్టి ఈ రోజే దీపావళి జరుపుకోవాలి. ఇక ఆ రోజు పూర్తి ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు ఉంటుందని వివరించారు. లక్ష్మీ పూజ కూడా అదే రోజు రాత్రి జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు. ఆ రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల మధ్య జరుపుకోవాలని వివరిస్తున్నారు.
కొంత మంది కేదారీశ్వర..
దీపావళి పండగ రోజు.. లక్ష్మీ గణపతిని అంతా పూజిస్తారు. పలువురు ఆ రోజు కేదారీశ్వర వ్రతాన్ని సైతం జరుపుకుంటారు.
ధన త్రయోదశి..
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభమవుతంది. ఇది అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1. 54 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర 18వ తేదీన ధన త్రయోదశి జరుపుకోవాలి.
ధన త్రయోదశి.. ఆ రోజు.. ఏం కొనుగోలు..
ధన త్రయోదశి నాడు ధన్వంతరి, లక్ష్మీ కుబేరులను పూజిస్తారు. ఈ రోజు బంగారం,వెండితో సహా గృహోపకరణాలను కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. ఈ రోజు భూమి, వాహనం తదితర వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇంటిలో సంతోషం, సంపద వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు. మట్టి దీపాలు, శ్రీ యంత్రం, బంగారం, వెండి ఆభరాలు, పాత్రలు, చీపురు, ఉప్పు మొదలైని కొనుగోలు చేయడం అత్యంత శుభమని నమ్ముతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి నుంచి ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం
భారత్, పాక్‌లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
For More devotional News And Telugu News