Share News

Diwali: దీపావళి నుంచి ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం

ABN , Publish Date - Oct 14 , 2025 | 07:37 AM

దీపావళి నుంచి కొన్ని రాశుల వారికి జాక్ పాట్ కొట్టనున్నారు. ఈ రాశుల వారికి ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.

Diwali: దీపావళి నుంచి ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం

దీపావళి నుంచి ఐదు రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పండగ నాటి నుంచి ఆరు నెలల పాటు ఈ రాశుల వారికి కలిసి వస్తుందని వివరిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి పండగ సోమవారం అంటే.. అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తులా, ధనుస్సుతో సహా ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలగనుంది. ఈ రాశుల వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం పట్టనుంది. దీని వల్ల కీర్తి, ధనం, సుఖ సంతోషాలు లభించనున్నాయి. ఆ ఐదు రాశులు..


తులా రాశి: ఈ రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే కోరుకున్న విజయాన్ని సైతం వారు సొంతం చేసుకుంటారు.


ధనుస్సు రాశి: ఈ రాశి వారికి గురు గ్రహం యోగిస్తుంది. ఆ ప్రభావంతో ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఎదురవుతాయి. దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. యువత కెరీర్‌లో నూతన శిఖరాలు అందుకుంటారు. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల్లో సఖ్యత పెరుగుతుంది. పాత వివాదాలకు చెక్ పెడతారు. దీంతో మానసిక ప్రశాంతతతోపాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది.


కుంభరాశి: ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలిస్తోంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు అయితే.. ఇది అనుకూల సమయమని చెప్పవచ్చు. అందులో లాభం వచ్చే సూచనలున్నాయి. అలాగే ఆర్థిక లాభం సూచిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. విద్య, విదేశాలకు వెళ్లడానికి ఇది అనుకూల సమయం. దీని వల్ల ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి.


వృషభరాశి: ఈ రాశి వారికి ఈ కాలంలో ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ కాలం. ఈ రాశి శుక్ర గ్రహం ద్వారా ప్రభావితమవుతుంది. అదీకాక ఇది ధనం వృద్ధికి సంబంధించిన గ్రహం. ఇది ఈ రాశి వారికి చాలా శుభ సమయం. ఈ రాశి వారికి ఆర్థికంగా గొప్ప విజయం లభిస్తుంది. అలాగే చాలా కాలంగా ఉన్న సమస్యలు సైతం తొలగిపోతాయి.


మిథునరాశి: ఈ రాశి వారికి దీపావళితో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ పండగ నాటి నుంచి ఈ రాశి వారికి కెరీర్‌లో పురోగతి, వ్యాపారంలో లాభంతోపాటు ఆస్తి సైతం వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారం, వాణిజ్య రంగాల్లో సానుకూల ప్రభావం ఉంటుంది. కొత్త వ్యాపారాలు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక మీ నగదు ఎక్కడైనా చిక్కుకున్నట్లు అయితే.. అది తిరిగి వచ్చే అవకాశం ఉంది.


గమనిక..

ఇవి జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి.. వీటిని ఎంతవరకూ పరిగణనలోకి తీసుకోవాలన్నది పూర్దిగా మీ వ్యక్తిగతం. ఈ రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించవలదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలతోపాటు మార్పులుంటాయని గమనించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

బాబోయ్‌ ఇథనాల్‌

కొత్తగా హెచ్‌-1బీ ఉద్యోగులను నియమించం: టీసీఎస్‌ సీఈవో కృతివాసన్‌

For More devotional News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 08:29 AM