TCS CEO Kriti Vasudevan: కొత్తగా హెచ్-1బీ ఉద్యోగులను నియమించం టీసీఎస్ సీఈవో కృతివాసన్ వెల్లడి
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:22 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హెచ్-1బీ వీసాలపై కొత్త ఉద్యోగులను తీసుకోబోమని టీసీఎస్ సీఈవో కే కృతివాసన్ తెలిపారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హెచ్-1బీ వీసాలపై కొత్త ఉద్యోగులను తీసుకోబోమని టీసీఎస్ సీఈవో కే కృతివాసన్ తెలిపారు. వారికి బదులు అమెరికాలోని స్థానిక ప్రతిభావంతులను నియమించుకోవడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అమెరికాలో తమ కంపెనీకి 32 వేల మంది సిబ్బంది ఉండగా.. వారిలో దాదాపు 11 వేల మంది హెచ్-1బీపై వచ్చిన వారేనని చెప్పారు. హెచ్-1బీ వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలని భావిస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుకు పెంచడం టెక్ కంపెనీల్లో గందరగోళానికి దారి తీసిన తెలిసిందే.