Om Prakash Singh Appointed as New DGP: కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:14 PM
రాష్ట్ర డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ సంస్థ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఛండీగఢ్, అక్టోబర్ 14: హర్యానా కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నియమించింది. ప్రస్తుతం హర్యానా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏండీగా ఓం ప్రకాశ్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు రాష్ట్ర డీజీపీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారులు కుల వివక్ష, అవమానాలు, వేధింపులు తట్టుకో లేక హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆయన.. తన సూసైడ్ నోట్‌లో హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ బిజార్ణియా సహా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు రాశారు. వారి వేధింపులే తన ఈ ఆత్మహత్యకు కారణమంటూ ఆయన రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచే కాకుండా.. పూరన్ కుమార్ కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. దాంతో రోహ్‌తక్ ఎస్పీ బిజార్ణియాపై ప్రభుత్వం ఇప్పటికే బదిలీ వేటు వేసింది. అలాగే డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను సెలవుపై ప్రభుత్వం పంపించింది. దీంతో కొత్త డీజీపీగా తాత్కాలిక నియామకం అనివార్యమైంది.
మరో వైపు అక్టోబర్ 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబం.. తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రముఖ రాజకీయ పార్టీల అధినేతలతో వరుస భేటీ అవుతుంది. ఈ ఆత్మహత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని.. అలాగే పూరన్ కుమార్ మరణించే ముందు పేర్కొన్న ఉన్నతాధికారులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం కోరుతుంది. ఆ క్రమంలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సైతం హర్యానాలోనఈ కుటుంబం మంగళవారం పరామర్శించనున్నారు.
పూరన్ కుమార్ భార్య అమ్నేతి కుమార్.. అదే రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్ సమయంలో.. హర్యానా ముఖ్యమంత్రి నయిబ్ సింగ్ సైనీ సారథ్యంలోని ఉన్నతాధికారి బృందం విదేశాల్లో పర్యటిస్తుంది. పూరన్ కుమార్ తెలుగు రాష్ట్రానికి చెందిన వారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
భారత్, పాక్‌లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
For More National News And Telugu News