AP News: 14 మంది ఎస్‌పీఎస్ అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి..
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:52 PM
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన 14 మందికి ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ..కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి:కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన 14 మందికి ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ..కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్‌లుగా ఎన్నికైనా అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో ఉండాలని సూచించింది. యూపీఎస్సీ ఛైర్మన్ అధ్యక్షతన పదోన్నతి కమిటీ పదోన్నతులకు ఆమోదం తెలిపింది.
2010 గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన చౌడేశ్వరి, లక్ష్మీనారాయణ, ఈశ్వర్‌రావు, హిమావతి, లావణ్య లక్ష్మి, వెంకటరత్నం, లత మాధురి, సురేష్ బాబు, కరీముల్లా షరీఫ్, సత్తిబాబు, సుప్రజ, కృష్ణ ప్రసన్న, శ్రీనివాస్, కె.శ్రీనివాస్‌లకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పదోన్నతి ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను ఇవాళ కమిటీ విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి
వెదర్ అప్‌డేట్స్.. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు