Share News

Weather Alert: వెదర్ అప్‌డేట్స్.. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:26 AM

Weather Alert: హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

Weather Alert: వెదర్ అప్‌డేట్స్.. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Weather Alert

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో గరిష్ఠంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అమీర్‌పేట్, పంజాగుట్ట, మణికొండ ప్రాంతాల్లో భారీగా వరదనీరు వచ్చి చేరింది. నిన్నటి వర్ష ప్రభావం నుంచి ఇంకా కోలుకోని తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు కూడా తూర్పు, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో సాయంత్రం, రాత్రి సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


మరో ఐదు రోజులు భారీ వర్షాలు

రేపటి నుంచి మరో ఐదు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 9, 10 తేదీల్లో నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11, 12వ తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. 13వ తేదీన తెలంగాణలోని అన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి

పులివెందుల జడ్పీటీసీని గెలుచుకుని రండి

వెదర్ అప్‌డేట్స్.. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Updated Date - Aug 08 , 2025 | 12:44 PM