CM Chandrababu Naidu: పులివెందుల జడ్పీటీసీని గెలుచుకుని రండి
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:56 AM
పులివెందుల జడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకుని రావాలని.. తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.
- టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
కడప: పులివెందుల(Pulivendula) జడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకుని రావాలని.. తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu) వెల్లడించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇతర 40 మంది నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీడీపీ(TDP) హయాంలోనే పులివెందులకు కృష్ణాజలాలు అందించి పంటలను కాపాడామన్నారు. ఇప్పుడు జడ్పీటీసీ(ZPTC)ని గెలుచుకురండి.. పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి జగన్ చేయని విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలను జనంలోకి తీసుకెళ్లాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
Read Latest Telangana News and National News